Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీటీఎల్ఎఫ్,ఎస్ఎఫ్ఐ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం ఇన్స్ట్ంట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ), తెలంగాణ ప్రయివేట్ టీచర్స్, లేక్చరర్స్ ఫెడరేషన్(టీపీటీఎల్ఎఫ్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలేకర్ల సమావేశం నిర్వహించాయి. టీపీటీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ ఏ. విజరు కుమార్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు మాట్లాడుతూ 2020-21 విద్యా సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులు మొత్తం 5వేల మంది విద్యార్థులు మార్చిలో పైనల్ పరీక్ష రాస్తే 45 శాతం మందికి పైగా ఫెయిల్ అయ్యారన్నారు. ఆ వెంటనే సప్లిమెంటరీ పరీక్ష పెట్టగా 7 శాతం తప్ప అందరూ పాస్ అయ్యారని గుర్తుచేశారు. అంటే 92. 5 శాతం మంది విద్యార్థులు ఎలా ఉత్తీర్ణులయ్యారని ప్రశ్నించారు. దీంతో పేపర్ లీక్ అయిందని అర్థమవుతున్నదని చెప్పారు. కాళోజీ యూనివర్సిటీ పరీక్షల అధికారుల పేపర్ లీక్ చేశారని పలువురు తల్లిదండ్రులు సమాచారమిచ్చారని తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రయివేటు మెడికల్ కాలజీ మేనేజ్ మెంట్ హస్తం కూడా ఉందన్నారు. ప్రభుత్వ కాలేజీల్లో చదివిన విద్యార్ధులే ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారని చెప్పారు. పేపర్ లీకేజీకి బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. విలేకర్ల సమావేశంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎల్ మూర్తి, ఉపాధ్యక్షుడు టి. రవి, హైదరాబాద్ కార్యదర్శి కె. అశోక్ రెడ్డి, టీపీటీఎల్ఎఫ్ హైదరాబాద్ నాయకులు కె. విజరు కుమార్ పాల్గొన్నారు.
దోషులను కఠినంగా శిక్షించాలి :ఏఐఎస్ఎఫ్
ఎంబీబీఎస్ పరీక్ష పేపర్ లీక్ పై విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మన్ ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2021 - 2022 విద్యా సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులు ఫైనల్ పరీక్ష ను మార్చిలో రాశారని తెలిపారు. ఇందులో 45శాతం విద్యార్థులు ఫెయిల్ అయ్యారని తెలిపారు. ఆ తర్వాత సప్లమెంటరీ పరీక్ష పెట్టగా 96శాతం విద్యార్థులు పాస్కావటంపై పలు అనుమానాలు ఉన్నాయనీ, పేపర్ లీక్ అయిందనే వార్తల నేపథ్యంలో తగిన విధంగా విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.