Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సబ్బండ వర్గాల సామాజిక తెలంగాణను త్వరలోనే సాధిస్తామని బీసీ రాజ్యాధికార సమితి కన్వీనర్ దాసు సురేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్లో జలదృశ్యంలో ''బాపూజీ చెంత - బీసీల బతుకమ్మ'' అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దాసు సురేశ్ మాట్లాడుతూ.. బాపూజీ కోరుకున్న సామాజిక తెలంగాణా సాధనను, బీసీ ముఖ్యమంత్రిని కండ్లారా చూసే రోజు త్వరలోనే రాబోతున్నదన్నారు. కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి ముఖ్య సలహాదారులు వీజీఆర్ నారగోని, కన్వీనర్ దొంత ఆనందం, ఓబీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు దానకర్ణాచారి, ఓబీసీ మహిళా అసోసియేషన్ అధ్యక్షులు భాగ్యలక్ష్మీ, కార్యక్రమ ముఖ్య సమన్వయకర్త బోనం ఊర్మిళ , శారదా, గుంతక రూప , గుండేటి శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.