Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఐఓఎఫ్ఎస్ అడిషనల్ కమిషనర్ వై సత్యనారాయణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహాత్మాగాంధీ స్వాతంత్రోద్యమంలో అనేక పోరాటాలకు రూపశిల్పిగా ఉన్నారని మాజీ ఐఓఎఫ్ఎస్ అడిషనల్ కమిషనర్ వై సత్యనారాయణ తెలిపారు. ఆదివారం హైదరాబాద్లోఎస్. ఆర్. శంకరన్ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో గాంధీ 153 వ, రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 118 వ జయంతిని పురస్కరించుకుని సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ ఇద్దరు నాయకుల పుట్టినరోజును నిర్వహించుకోవడం ఆనందదాయకమని తెలిపారు. ఈనాటి విద్యార్థులు వారి జీవిత చరిత్రలను అధ్యయనం చేయాలని సూచించారు.తద్వారా మంచి అంశాలను తెలుసుకుని భవిష్యత్తుకి బాటలుగా వేసేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని తెలిపారు. వారు పోరాడిన తీరు, దేశానికి స్వాతంత్రం తెచ్చిన తీరూ చాలా గొప్పదన్నారు. తద్వారా వారి స్ఫూర్తితో అనేక దేశాలు ఉద్యమాలు, పోరాటాలకు రూపకల్పన చేశాయని తెలిపారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో లాల్ బహుదూర్ శాస్త్రి, మహాత్మా గాంధీ జీవిత చరిత్రలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఆర్. శంకరన్ ఐఏఎస్ అకాడమీ ప్రిన్సిపల్ కే. సురేందర్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కే. సతీష్ కుమార్ పాల్గొన్నారు.