Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతిపితకు గుత్తా, పోచారం ఘన నివాళి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మహాత్ముని మార్గంలోనే సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. గాంధీ జయంతిని పురస్కరించుని అసెంబ్లీ ప్రాంగణంలో గాంధీ విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయులు గాంధీని కొనియాడారు. ఆయన చూపించిన మార్గం యావత్తు ప్రపంచానికి మార్గదర్శి అయిందని గుర్తు చేశారు. గాంధీ జయంతిని దేశ, విదేశాల్లో కూడా ఘనంగా నిర్వహించడం మన జాతికి గర్వకారణమన్నారు. ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ మత ఛాందస వాదం ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. మత ఛాందసవాదుల చేతిలోకి కొన్ని దేశాలు ఆర్థికంగా కుప్పకూలాయని చెప్పారు. హిందూ మతం పేరిట తాజాగా కుట్రలు జరుగుతున్నాయనీ, వాటిని తిప్పికొట్టాలని కోరారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్యేలు కోనేరు కొనప్ప, చందర్రావు, ఎమ్మెల్సీలు దయానంద్, దండే విఠల్, ఎల్ రమణ, ఫరూక్ హుస్సేన్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వేదాంతం నరసింహాచార్యులు, టీఆర్ఎస్ఎల్పీ కార్యదర్శి రమేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.