Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర పండుగ బతుకమ్మ ఆఖరి రోజు..'సద్దుల బతుకమ్మ' సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నిండిన చెరువులు, పచ్చని పంట పొలాల పక్కన ప్రకృతితో మమేకమై, తొమ్మిది రోజుల పాటు సాగిన ఆడబిడ్డల ఆటా పాటలతో, పల్లెలు పట్టణాలు ప్రత్యేక సాంస్కృతిక వాతావారణాన్ని సంతరించుకున్నాయని తెలిపారు. విజయాలనందించే విజయ దశమిని స్వాగతిస్తూ ముగిసే తొమ్మిది రోజుల బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు జయప్రదమయ్యాయని తెలిపారు.