Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ నేతలకు మంత్రి కేటీఆర్ హితవు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మునుగోడు ఉప ఎన్నికకు ఈనెల 15లోపు నోటిఫికేషన్ వస్తుదంటూ బీజేపీ నేత సునీల్ బన్సల్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ నేతలు ముందుగా తమ పార్టీ పేరును మార్చుకోవాలంటూ ట్విటర్ వేదికగా ఎద్దేవా చేశారు. ఎలక్షన్ కమిషన్ కంటే ముందే ఆ పార్టీ నేతలు ఎన్నికల తేదీలను ప్రకటిస్తున్నారు.. ఈడీ కంటే ముందే ఏయే నాయకుల ఇండ్లపై సోదాలు జరుగుతాయో చెబుతున్నారు.. ఐఎన్ఏ అధికారుల కంటే ముందే నిషేధాలను విధిస్తున్నారు.. ఐటీ అధికారుల కంటే ముందే నగదు వివరాలను చెబుతున్నారు.. సీబీఐ కంటే ముందే నిందితుల పేర్లను బయటపెడుతున్నారు... అందువల్ల బీజేపీ నేతలు తమ పార్టీ పేరును... 'బీజే..ఈసీ-సీబీఐ-ఎన్ఐఏ-ఐటీ-ఈడీ...పీ' అని మార్చుకోవాలంటూ ఆయన హితవు పలికారు.