Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీస్ గృహ నిర్మాణ సంస్థ చైర్మెన్ కోలేటి దామోదర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి, దేశ గతిని మారుస్తారని తెలంగాణ పోలీస్ గృహ నిర్మాణ సంస్థ చైర్మెన్ కోలేటి దామోదర్ అన్నారు. ఈ మేరకు ఆదివారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలో బీజేపీకి చెక్ పెట్టే సత్తా సీఎం కేసీఆర్‌కు మాత్రమే ఉందన్నారు. కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నదనీ, కేసీఆర్ పెట్టే జాతీయపార్టీలో పలు పార్టీలు విలీనం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధికి మోడల్‌గా మార్చి, దేశానికి ఆదర్శంగా నిలిపారన్నారు. దసరా రోజు ఆయన తీసుకొనే నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్టు పేర్కొన్నారు.