Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలువురు అభినందనలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
2023-2026 నా లుగు సంవత్సరాలకుగాను తెలంగాణ ఇన్ఫర్మే,న్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) గ్లోబల్ ప్రెసిడెంట్‌గా సందీప్ ముఖ్తల ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, గోరటి వెంకన్న, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, టీఎస్టీఎస్ చైర్మన్ జగన్, వీ ప్రకాష్, గాయకుడు సుద్దాల అశోక్ తేజ తదితరులు సందీప్ కు అభినందనలు తెలిపారు. ఏడు విభాగాల్లో వచ్చిన నామినేషన్లతో సందీప్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జయేశ్ రంజన్ మాట్లాడుతూ, టీటా అనేది.... ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవడమే కాకుండా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నదని ప్రశంసించారు.