Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ల సంఘాల సంయుక్త సమావేశంలో నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆర్ఎంపీ, పీఎంపీ తదితర అనర్హులను వైద్యరంగంలో ప్రోత్సహించడాన్ని నిరసిస్తూ పలు డాక్టర్లు సంఘాలు ఐక్య కార్యచరణ ప్రకటించాయి. ఆదివారం హైదరాబాద్ కోఠిలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) రాష్ట్ర కార్యాలయం లో అత్యవసర సమావేశాన్ని నిర్వహించాయి. ఈ సమావేశంలో ఐఎంఏ, హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ), తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం (టీడీఎఫ్), తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టీజూడా), సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఎస్ఆర్డీఏ), తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ డాక్టర్స్ ఫోరం రాష్ట్ర నాయకులు పాల్గొని చర్చించారు. అనంతరం టీజూడా రాష్ర అధ్యక్షులు డాక్టర్ కార్తీక్ నాగుల ప్రకటన విడుదల చేశారు. సోమవారం ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో నల్లబ్యాడ్జీలతో నిరసన, నాలుగున రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుపై రాష్ట్ర గవర్నర్, సీఎం, పీఎంలతో పాటు నేషనల్ మెడికల్ కమిషన్‌కు ఫిర్యాదు, ఏడున జిల్లా కలెక్టర్లు, డీఎంహెచ్ఓ, డీహెచ్, టీఎస్ఎంసీలకు వినతిపత్రాలు, ఎనిమిదిన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రిపై మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు, తొమ్మిదిన సమీక్ష, 10న మెడికల్ విద్యార్థులు, మేధావులతో సమావేశాలు, 14న డీహెచ్, టీఎస్ ఎంసీ బాధ్యుల ఘెరావ్, 15న ధర్నాచౌక్ వద్ద బహి రంగ సభ, 16న తదుపరి భవిష్యత్ కార్యచరణ ప్రణాళికపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. తాము చేయనున్న పోరాటానికి తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం, తెలంగాణ వైద్య విధాన పరిషత్ డాక్టర్ల సంఘం, మెడికల్ జేఏసీ మద్దతు ప్రకటిం చిందని పేర్కొన్నారు. అంతకు ముందు వారు ఐఎం ఏ ప్రాంగణంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సంపత్ మాట్లాడుతూ, అల్లోపతిక్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు, కొంత మంది ప్రతిపక్ష నాయకులు మాట్లాడటం సరికాదని ఖండించారు.కార్యక్రమంలో హెచ్ఆర్డీఏ అధ్యక్షులు డాక్టర్ కె.మహేశ్ కుమార్, టీజూడా అధ్యక్షులు డాక్టర్ కార్తీక్, నాయకులు డాక్టర్ శ్రీకాంత్, హెచ్ఆర్డీఏ కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్, టీడీఎఫ్ అధ్యక్షులు డాక్టర్ అన్వేష్, ఎస్ఆర్డీఏ నాయకులు డాక్టర్ జి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.