Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పోతినేని, టి.సాగర్మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి
నవతెలంగాణ-చౌటుప్పల్
రీజినల్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్ మార్చాలని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధానకార్యదర్శులు పోతినేని సుదర్శన్, టి.సాగర్, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. రీజినల్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్ మార్చాలని డిమాండ్‌చేస్తూ సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట తెలంగాణ రైతుసంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రీజినల్ రింగ్‌రోడ్డు వచ్చే మార్గంలో ఉన్న భూముల ధరలు బహిరంగ మార్కెట్లో రూ.80 లక్షల నుంచి రూ.1.20కోట్ల వరకు ఉండగా కేంద్ర ప్రభుత్వం మాత్రం భూ నిర్వాసితులకు ఎకరాకు రూ.5లక్షల నుంచి రూ.6 లక్షలు మాత్రమే చెల్లిస్తామనడం దారుణమన్నారు. పెద్దల భూముల్లోకి వెళ్లకుండా ఎకరం, అర ఎకరం ఉన్న పేద రైతుల భూములు లాక్కునేందుకు పూనుకుంటుందని విమర్శించారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌కు 2013 చట్టాన్ని జోడించి గ్రామాల్లో మూడు రెట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు రెట్లు పరిహారం చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త భూసేకరణ చట్టాన్ని తప్పుగా అమలుచేస్తున్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో అలైన్మెంట్ మార్పించేందుకు భూనిర్వాసితులందరూ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఉద్యమానికి తెలంగాణ రైతుసంఘం రాష్ట్రకమిటీ పూర్తి సహకారం, మద్దతు అందిస్తుందన్నారు. అనంతరం రైతుసంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మేక అశోక్‌రెడ్డి, మాటూరి బాలరాజు మాట్లాడారు. మల్లన్న సాగర్, ముచ్చర్ల ఫార్మా కోసం భూములు సేకరిస్తున్న సందర్భంలో రైతాంగం, బాధితులు వీరోచితంగా పోరాడారని, అదే తరహాలో పోరాడి రాష్ట్ర భూ భాధితులకు తెలంగాణ రైతుసంఘం అండగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు బూర్గు కృష్ణారెడ్డి, సీపీఐ(ఎం) మండల, మున్సిపల్ కార్యదర్శులు గంగదేవి సైదులు, బండారు నర్సింహ, మున్సిపల్ వైస్‌చైర్మెన్ బత్తుల శ్రీశైలం, నాయకులు నాగవెల్లి సత్యనారాయణ, దుబ్బ లింగం, బాధితులు దబ్బటి రాములు, సుర్కంటి రాజిరెడ్డి, వెంకట్‌రెడ్డి, రాంరెడ్డి, ఏనుగు ప్రతాప్‌రెడ్డి, సప్పిడి లక్ష్మారెడ్డి, మిర్యాల కిరణ్, బోరెం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.