Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈడీతో కుట్రలు...
- యూపీఏను చీల్చేందుకే కేసీఆర్ జాతీయ పార్టీ : రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారత్ జోడో యాత్రకు భయపడి బీజేపీ ఈడీని ఉపయోగించి కుట్రలు చేస్తున్నదని టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్రెడ్డి విమర్శించారు. సోమవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్ల్షాడారు. బీజేపీ కుట్రలో భాగంగా మూసేసిన హెరార్డ్ కేసును తిరిగి తెరవడం, జోడో యాత్రలో పాల్గొనకుండా ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్య నాయకులకు నోటీసులివ్వడం, విచారణ పేరుతో వేధించడం తదితర చర్యలకు పూనుకుంటుందన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి రూ.4,841 కోట్ల చందాలిచ్చినప్పటికీ ఆ పార్టీలో ఉన్న నాయకులకు మాత్రం నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిం చారు. కాళేశ్వరాన్ని ఏటీఎంలాగా మార్చుకున్నా, గులాబీ కూలీల చేసిన కేసీఆర్ అవినీతికి చర్యలెందు కు తీసుకోలేదో సమాధానం చెప్పాలన్నారు. పైపెచ్చు ఢిల్లీలో అత్యంత విలువైన స్థలంలో పార్టీ కార్యాలయా నికి స్థలం కేటాయించారని తెలిపారు. బీజేపీకి ఈడీ అనేది ఎలక్షన్ డిపార్ట్మెంట్గా మారిందని విమర్శించారు. మునుగోడులో తమ పార్టీ నిలబెట్టిన ఆడబిడ్డకు ఒక అవకాశమివ్వాలని కోరారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎవరు పోటీ చేసినా అందరిని సమానంగా గౌరవిస్తామనీ, పలు కార్యక్రమాలు ఉండటం వల్లనే రాష్ట్రానికి విచ్చేసిన శశిథరూర్ను కలవలేకపోయి నట్టు స్పష్టం చేశారు.
యూపీఏను చీల్చి...బీజేపీకి పరోక్ష మద్ధతు ఇవ్వడానికే
యూపీఏను చీల్చి బీజేపీకి పరోక్ష మద్దతు ఇవ్వడానికే కేసీఆర్ జాతీయ పార్టీ అంటూ డ్రామాలాడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. జాతీయ స్థాయిలో జగన్, అసదుద్దీన్ ఓవైసీలను ఎందుకు కలుపుకోవడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ నిజంగా మోడీని ఓడించాలనుకుంటే బీజేపీ భాగస్వామ్యపక్షాలను బయటికి తీసుకురావాలని సవాల్ చేశారు. ప్రధాని సూచనల మేరకే కేసీఆర్ చర్యలున్నాయని తెలిపారు. ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించి బీజేపీ ఇప్పటి వరకు కేసీఆర్పై చర్యలెందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.