Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారిక అభ్యర్థి కాదు : కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో సోనియాగాంధీతో పాటు ఆమె కుటుంబం సైతం తటస్థంగా ఉందని అధ్యక్ష అభ్యర్థి శశిథరూర్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మేనిఫెస్టోను విడుదల చేశారు. మల్లిఖార్జున ఖర్గే అధికారిక అభ్యర్థి, గాంధీ కుటుంబం ఆయనకు మద్ధతిస్తున్నదంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత తాను గాంధీ కుటుంబంలోని ముగ్గురితో మాట్లాడాననీ, ఆ కుటుంబం పారదర్శక ఎన్నికకు కట్టుబడి ఉందని తెలిపారు. మల్లిఖార్జున ఖర్గే, తాను ప్రత్యర్థులం కాదనీ, సైద్ధాంతిక విబేధాలు లేవనీ, తామిద్దరం కాంగ్రెస్ విలువలతో కూడిన ప్రాథమిక అంశాలకు కట్టుబడి ఉన్నారని చెప్పారు. పార్టీ ఒక కుటుంబంగా బలపడటాని కి వీలుగా, దాన్ని ఎవరు శక్తివంతంగా ముందుకు తీసు కెళ్తారనే చర్చ మాత్రమే జరుగుతున్నదని తెలిపారు. ఎన్నిక ల తర్వాత తిరిగి అంతా ఒక కుటుంబంగా ముందుకెళ్తామ ని చెప్పారు. పాలకపక్ష బీజేపీని ఎలా ఎదుర్కోవా లనే దాని పైనే తాము ప్రధానంగా చర్చిస్తున్నామని తెలిపారు.