Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ఎర్రబెల్లికి సర్పంచుల సంఘం విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు రావల్సిన కేంద్ర ప్రభుత్వ నిధులు 15 నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయనీ, తక్షణం వాటిని ఇప్పించాలని తెలంగాణ సర్పంచుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం సంఘం ఉపాధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును హైదరాబాదులో వినతిపత్రం సమర్పించారు. నిధులు పెండింగ్‌లో ఉండటంతో కొత్తగా ఏర్పడిన గ్రామపంచాయతీల అభివృద్ధిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు.