Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ కార్మికుల ధర్నా
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ముషీరాబాద్‌లోని ఒకటవ నెంబర్ డిపో మూసివేతను యాజమాన్యం ఉపసంహరించు కోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ డిపో నుంచి షెడ్యూల్స్‌ను ఇతర డిపోలకు బదిలీ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక్కడి నుంచి బర్కత్‌పుర, కాచిగూడ, ఫలక్‌నుమా, ఫారూఖ్ నగర్ డిపోలకు షెడ్యూలు ట్రాన్సఫర్ చేశారని తెలిపారు. దీన్ని వ్యతిరేకిస్తూ సోమవారం డిపోలోని అన్నియూనియన్ల ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కే రాజిరెడ్డి మాట్లాడుతూ ముషీరాబాద్ 1షెడ్యూలు ఇతర డిపోలకు ట్రాన్స్ఫర్ చేసి, ఆ స్థలాన్ని ప్రయివేటు వారికి ఇచ్చే ప్రతిపాదనలు విమరించుకోవాలని డిమాండ్ చేసారు. టీఎమ్‌యూ కార్యదర్శి రవినాథ్ మాట్లాడుతూ డిపోను మూసివేసే ప్రతిఫాదన ఉపసంహరించుకోవాలనీ, లేకుంటే ఆందోళన కొనసాగిస్తామనీ చెప్పారు. ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి ఆర్ కిషన్‌గౌడ్ సంస్థ నియమ, నిబంధనలను ఉల్లంఘిస్తూ యాజమాన్యం వ్యవహరిస్తున్నదని విమర్శించారు.