Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టు ఉత్తర్వులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నాంపల్లి పూల్‌బాగ్‌లో ఉన్న 1,789 చదరపు మీటర్ల స్థలం ప్రభుత్వానిదేనని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేయాలని కోరుతూ అమృతభారు ఇతరులు వేసిన అప్పీల్ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ వేణుగోపాల్‌తో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం తీర్పు చెప్పింది. హైదరాబాద్‌లోని నాంపల్లిలోని 93/1, 93/2, 94 సర్వే నెంబర్లో 22,426 చదరపు మీటర్లలో 1,789 చదరపు మీటర్లను రాజా రాందేవ్రావు నుంచి అధికారికంగా కొన్నామనీ, కింది కోర్టు తమ వద్ద ఉన్న ఆధా రాలను పరిగణనలోకి తీసుకోలేదంటూ పిటిషనర్లు చేసిన వాదనను కొట్టేసింది.
ఆ భూమి సర్కారుదేనంటూ ప్రభుత్వం వాదించింది. అనంతరం హైకోర్టు తీర్పు వెలువరించింది.