Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హయత్‌నగర్ పోలీసులకు చిక్కిన గంజాయి స్మగ్లర్లు
- ఇద్దరు అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల అరెస్ట్
- 1300 కిలోల గంజాయి, డీసీఎం, రెండు సెల్ఫోన్లు స్వాధీనం
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఈస్ట్ గోదావరి ఏజెన్సీ ప్రాంతం నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి గంజాయిని సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలోని ఇద్దరిని హైదరాబాద్ హయత్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 1300 కిలోల గంజాయి, డీసీఎం, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.2కోట్ల 80లక్షలుంటుందని పోలీసులు తెలిపారు. గురువారం నేరేడ్మెట్లోని సీపీ కార్యాలయంలో సీపీ మహేష్‌భగవత్ వివరాలు వెల్లడించారు.
ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన పెంటారావు, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రాజేష్ కుమార్, మధ్యప్రదేశ్‌కు చెందిన నరేంద్ర హరిజన్, చంద్రేష్ సాకేత్ ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఈస్ట్ గోదావరి ఏజెన్సీ ప్రాంతాల్లో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేస్తున్నారు. అక్కడి నుంచి ఛత్తీస్‌గఢ్‌కు గంజాయిని తరలించేందుకు డీసీఎం ఒక ట్రిప్‌కు రూ.50వేల చొప్పున అద్దె చెల్లిస్తున్నారు. హైదరాబాద్ మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోని రాయిపూర్‌కు గంజాయిని తరలిస్తున్నారు. ఇదిలావుండగా, పెద్దఎత్తున గంజాయి తరలిస్తున్న సమాచారం అందుకున్న హయత్‌నగర్ పోలీసులు అలర్ట్ అయ్యారు. రెండ్రోజులుగా వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో డీసీఎంను గుర్తించిన పోలీసులు నరేంద్ర హరిజన్, చంద్రేష్ సాకేత్‌ను అదుపులోకి తీసుకున్నారు. డీసీఎంలో 40 బ్యాగ్ల్లోని 1300కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హయత్‌నగర్ పోలీసులను సీపీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్, వనస్థలిపురం ఏసీపీ కె.పురుషోత్తం రెడ్డి, ఇన్స్పెక్టర్ హెచ్.వెంకటేశ్వర్లు, డీఐ ఆర్.నిరంజన్ ఉన్నారు.