Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బర్రెకు సున్నం పూస్తే ఆవు అవుతుందా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. దివాళా తీసిన కంపెనీకి పేరు మార్చినట్లుగా బీఆర్ఎస్ తీరు ఉందని విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్కు దమ్ముంటే సీఎం పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్పై పోటీ చేయాలని సవాల్ విసిరారు. మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ పేరుతో ఏ ముఖం పెట్టుకుని ఓట్లడుగుతారని ప్రశ్నించారు. మూసీ నదిని ప్రక్షాళన చేయలేనోడు గంగానది గురించి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎనిమిది లక్షల 40 వేల దళిత కుటుంబాలకు దళిత బంధు ఇచ్చారనడం పచ్చి అబద్దమన్నారు. దమ్ముంటే దళితబంధుపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.