Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేర్వేరు కేసులు నమోదు
నవతెలంగాణ-శంషాబాద్
శంషాబాద్ విమానాశ్రయంలో పెద్దమొత్తంలో బంగారం పట్టుబడింది. ఏడు కిలోలకు పైగా బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
దుబారు నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీ చేయగా.. ఏడు కిలోల బంగారం లభ్యమైంది. దాని విలువ సుమారు మూడున్నర కోట్లు ఉంటుందని అంచనా. బ్యాంకాక్ నుంచి వచ్చిన మరో ప్రయాణికుడి నుంచి రూ. 46.05 లక్షల విలువైన, 865.6 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
లోదుస్తుల్లో దాచుకొచ్చిన మరో ప్రయాణికురాలి వద్ద 22 లక్షల 40 వేల విలువైన 435 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మరో ప్రయాణికుడి నుంచి విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.