Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మునుగోడు ఉప ఎన్నికలో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా ప్రజాగాయకుడు గద్దర్ పోటీ చేయనున్నారు. ఈమేరకు ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత కేఏ పాల్ ప్రకటించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నట్టు గద్దర్ తెలిపారు. ప్రపంచశాంతి కోసం కృషి చేస్తున్న పాల్‌తో కలిసి పనిచేయాలనే ఉద్దేశంతోనే ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రజల ఆశీర్వాదం కోసం శుక్రవారం నుంచి ప్రచారం ప్రారంభిస్తానన్నారు. గద్దర్ తొలిసారిగా ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ నవంబరు 3న జరగనుంది. అదే నెల 6న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.