Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10 కిలోల ఉచిత బియ్యం
- మంత్రి గంగుల కమలాకర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో మరో విడత 10 కిలోల ఉచిత బియ్యాన్ని డిసెంబర్ వరకు ఇవ్వనున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో మొత్తం 90.01 కోట్ల కార్డులు, 283.42 లక్షల లబ్దిదారులున్నారని తెలిపారు. వీరిలో కేంద్రం 54.37 లక్షల కార్డులు, 1.91 కోట్ల యూనిట్లకు ఐదు కిలోల చొప్పున మాత్రమే ఉచిత రేషన్ అందిస్తున్నదని చెప్పారు. మిగిలిన 35.64 లక్షల కార్డులు, 91.72 లక్షల మందికి రాష్ట్రమే పూర్తి వ్యయంతో ఉచితంగా రేషన్ సరఫరా చేస్తున్నదని వివరించారు. కేంద్రం అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు పీఎంజీకేఏవై పథకాన్ని పొడిగించిందనీ, ఈ నేపథ్యంలో రాష్ట్ర కార్డులకే 19,057 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అదనంగా రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తున్నదని పేర్కొన్నారు. వీటికి నెలకు రూ.75.75 కోట్ల చొప్పున రాబోయే మూడు నెలల్లో రూ.227.25 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనున్నదని వివరించారు. పీఎంజీకేఏవై మొదలైనప్పటి నుంచి అదనంగా 25 నెలలకు రూ.1,308 కోట్లు ఖర్చు చేశామనీ, వలస కూలీలకు రూ.500, ప్రతి కార్డుకు రూ.1,500 చొప్పున రెండు నెలలకు రూ.2,454 కోట్ల సాయం అందజేసిందని గుర్తుచేశారు.