Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ చీఫ్ రేవంత్ ట్వీట్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వీఆర్ఏలు 75 రోజులుగా ఆందోళన చేస్తున్నా...ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన పడిన చందంగా ఉందని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి ట్వీట్ చేశారు. వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన వీఆర్ఏల గోడు వినకుండా ఆ కాగితాన్ని వారి ముఖంపై విసిరికొట్టడం కేసీఆర్ అహంకారానికి పరాకాష్ఠ అని శుక్రవారం ట్వీట్టర్ వేదికగా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వారి డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు.