Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించడం ఎలా? అనే అంశంపై ఉచిత వర్క్‌షాప్ నిర్వహించనున్నట్టు 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమీ తెలిపింది. ఈ మేరకు అకాడమీ చైర్మెన్ పి.క్రిష్ణ ప్రదీప్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 12 నుంచి 16 వరకు ఐదు రోజుల పాటు నిర్వహించి ఉచిత వర్క్‌షాప్‌లో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, గైడెన్స్, ఆప్షనల్ ఎంపిక తదితర అంశాలపై యువ ఐఏఎస్‌లతో ప్రతి రోజు అవగాహన కల్పించనున్నట్టు తెలిపారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి బి.పి.ఆచార్య పర్యవేక్షణలో రాహుల్ రెడ్డి, మకరంద్, ప్రతీక్ షా, రాజర్షి, ముజ్జామిల్ ఖాన్ తదితరులు బోధిస్తారని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనీ, పూర్తి వివరాలకు 040-3505 2121, 86862 33879 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.