Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంషాబాద్
శంషాబాద్ ఎయిర్పోర్టులో 7.695 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబారు నుంచి ఈకే 528, ఈకె 524 విమానాల్లో వచ్చిన ముగ్గురు ప్రయాణికులను పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకొని తనిఖీలు నిర్వహించారు. వారి నుంచి 7.69కిలోల 24 క్యారెట్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈకే 528 విమానంలో వచ్చిన ఒక ప్రయాణికుని నుంచి 4.895 కేజీల బంగారం స్వాధీనం చేసుకోగా, దాని విలువ సుమారు రూ.2,57,04,895 ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో విమానం ఈకే 524లో వచ్చిన ఇద్దరు ప్రయాణికులను అనుమానం వచ్చి తనిఖీ చేయగా 2.800 గ్రాముల 24 బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
దీని విలువ సుమారు 1.48కోట్లు ఉంటుందని అంచనా. నిందితులను అదుపులోకి తీసుకొని అధికారులు విచారిస్తున్నారు.