Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
వేరే రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసిన వాహనాలను రిజిస్ట్రేషన్ నిబంధనలను ఉల్లంఘించి మార్పులు, చేర్పులు చేసిన వైనంపై ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం సుదీర్ఘంగా విచారించారు. గతంలో మణిపూర్ నుంచి కొనుగోలు చేసిన వాహనాలను నిబంధనలకు విరుద్ధంగా బీ3 నుంచి బీ4కు జేసీ ప్రభాకర్‌రెడ్డి మార్పు చేయటం ద్వారా అక్రమాలకు పాల్పడినట్టు ఈడీ ఆరోపించింది. దాని పైన కేసు నమోదు చేసుకొన్న ఈడీ అధికారులు.. ఆ సంస్థ ఎండీ ప్రభాకర్ రెడ్డిని శుక్రవారం హైదరాబాద్‌లోని తమ కార్యాలయానికి పిలిపించి దాదాపు ఐదు గంటల పాటు విచారించారు.
ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎలాంటి పొరపాటు చేయలేదనీ, తనను పిలిపించారు.. వచ్చాను.. మాట్లాడాను.. అని సమాధానమిచ్చి ప్రభాకర్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.