Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాదాద్రి ధర్మల్పై జెన్కో సీఎమ్‌డీ సమీక్ష
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లేవనెత్తిన అభ్యంతాలపై అవసరమైన వివరణ ఇవ్వాలని టీఎస్జెన్కో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. విద్యుత్ సౌధలో శుక్రవారం ఆ సంస్థ సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. గతంలోనే అన్ని రకాల పర్యావరణ అనుమతులు మంజూరయ్యాయనీ, అయినా ఎన్జీటీ మరికొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడం, నిర్మాణ పనులు నిలిపివేసి, ఉత్పత్తి ఆపాలని ఆదేశించడంపై జెన్కో అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేంద్రంతో పాటు అన్ని రకాల అనుమతులు తీసుకున్నాకే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినట్టు వివరించారు. గతంలో ప్రాజెక్టుకు 10 కి.మీ., పరిధిలో పర్యావరణ ప్రభావంపై అధ్యయనం జరిపి నివేదిక ఇచ్చామనీ, ఇప్పుడు 25 కి.మీ., పరిధిలో పర్యావరణంపై ఎన్జీటీ ఆదేశించడంపై చర్చించారు. పూర్తి వివరాలను కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖకు నివేదిం చి, తదుపరి ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ లేఖ రాయాలని నిర్ణయించారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ సరిహద్దు, యాష్ పాండ్ డిజైన్, రేడియో యాక్టి విటీ ఇంపాక్ట్‌కు సంబంధించిన అంశాలు ఇప్పటికే యాదాద్రి ప్లాంట్‌లో అమలు చేశామని తెలిపారు. యాదాద్రి ప్లాంట్ ఎన్విరాన్మెంటల్ క్లియ రెన్స్ కోసం దరఖాస్తు చేసే సమయంలోనే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్, ఫారెస్ట్ నోటిఫికేషన్ సెప్టెంబరు 14, 2016 నిబంధనల ప్రకారం అన్ని పరిశీలనలు పూర్తిచేసి సమర్పించామని తెలిపారు.