Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: దక్షిణ భారతదేశంలో అతి పెద్ద ప్లాట్ ప్రమోటర్ జీస్క్యేర్ హౌసింగ్ లిమిటెడ్ తమ నూతన కార్యాలయాన్ని హైదరాబాద్ లో ప్రారంభించినట్టు ప్రకటించింది. గచ్చిబౌలిలోని ఈ నూతన కార్యాలయంలో 200 మందికి పైగా ఉద్యోగులు పని చేసేందుకు తగిన వసతులు కల్పించినట్టు ఆ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం తమకు ఇక్కడ 75 మంది ఉద్యోగులు ఉన్నారని.. రాబోయే నెలల్లో మరింత మంది ఉద్యోగులను విధుల్లోకి తీసుకోనున్నామని జిస్క్వేర్ హౌసింగ్ సీఈఓ ఈశ్వర్ ఎన్ తెలిపారు. దేశంలో అత్యంత వేగంగా వద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్లలో తెలంగాణా ఒకటన్నారు ఈ నెలాఖరు నాటికి 200 మంది ఉద్యోగులకు పెంచుకోనున్నామన్నారు.