Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నీట్ 2022 పరీక్ష రాసిన హైదరాబాదీ జోత్స్నకు ముందుగా పేర్కొన్న 482 మార్కులను తర్వాత 294కి తగ్గించడానికి కారణన్ని చెప్పాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ సుమలత డివిజన్ బెంచ్ ఆదేశించింది. సెప్టెంబర్లో ఫలితాలు వెలువడినప్పుడు తనకు 482 మార్కులు వచ్చినట్టుగా ఎన్టీఏ వెబ్సైట్లో ఉందనీ, తర్వాత కాళోజీ హెల్త్ వర్సిటీ అప్లోడ్ చేసిన జాబితాలో మార్కులు 294గా ఉందనీ, దీనిపై వివరణ కోరుతూ మెయిల్ చేస్తే జవాబు రాలేదని ఆమె హైకోర్టులో శుక్రవారం లంచ్మోషన్ పిటిషన్ వేశారు. దీనిపై ఎన్టీఏ, వర్సిటీలు వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది.