Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ పేరు మార్పుపై టీజేఎస్
- మునుగోడులో పోటీచేస్తాం : ప్రొఫెసర్ కోదండరాం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాజకీయ ప్రయోజనం కోసమే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్కు సిద్ధాంతాలు లేవనీ, తెలంగాణ అస్థిత్వాన్ని వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వాదాన్ని, అస్థిత్వాన్ని కాపాడేందుకు ముందుకెళ్తామని చెప్పారు. మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి తన ప్రయోజనాలనే చూసుకుంటున్నారని విమర్శిం చారు. మునుగోడు బరిలో టీజేఎస్ పోటీ పడుతుందనీ, ఒకట్రెండు రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు. గద్దరతో చర్చలు జరుపు తామనీ, ఉమ్మడి అభ్యర్థిగా నిలబడితే ప్రచారం చేస్తామని స్పష్టం చేశారు.