Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహబూబ్‌నగర్ జిల్లా కౌకుంట్ల మండలం సమీపంలో ఘటన
- ప్రభుత్వం ఆదుకోవాలి : గొర్రెల కాపరులు
- రూ.6 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన సామాజికవేత్త పవన్
నవతెలంగాణ - మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
కుక్కలు తర మడంతో రైలు పట్టాలపై పరిగెత్తిన గొర్రెలను రైలు ఢకొీంది. 150 జీవాలు మృత్యువాత పడ్డాయి. 50 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండలం సమీపంలో రాజోలి అండర్ గ్రౌండ్ రైల్వే బ్రిడ్జి వద్ద శుక్రవారం జరిగింది. గొర్రెల కాపరులు తెలిపిన వివరాల ప్రకారం..
కౌకుంట్ల మండల కేంద్రానికి చెందిన కాపరులు మాసన్న, దూలన్న, తిరుపతయ్య తమ గొర్రెలు రైల్వే బ్రిడ్జి పరిసరాల్లో మేత మేస్తున్నాయి. ఈ క్రమంలో కుక్కలు గొర్రెలను తరిమాయి. దాంతో అవి రైలు పట్టాలపై పరిగెత్తాయి. అదే సమయంలో రైలు రావడంతో ఢకొీని 150 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. దాదాపు 50 గొర్రెలు గాయపడ్డాయి. మొత్తం 25 లక్షల నష్టం వాటిల్లిందని గొర్రెల కాపరులు కన్నీటిపర్యంతమయ్యారు. జీవాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ఆ మూడు కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. విషయం తెలుసుకున్న స్థానిక సామాజికవేత్త పవన్ కుమార్ యాదవ్ మూడు కుటుంబాలకు అండగా నిలవడానికి ముందుకు వచ్చారు. బాధిత కుటుంబాలను ఫోన్లో పరామర్శించి, వారికి అన్ని రకాలుగా అండగా ఉంటానని హామీనిచ్చారు. అధైర్యపడొద్దని చెప్పారు. మాసన్న కుటుంబానికి 2లక్షల 50 వేలు, దూలన్న కుటుంబానికి రెండు లక్షల రూపాయలు, తిరుపతయ్య కుటుంబానికి 1.50 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. త్వరలోనే వారి కుటుంబాలను కలిసి ఈ సహాయాన్ని అందజేయనున్నట్టు తెలిపారు. జిల్లా కురువ సంఘం అధ్యక్షులు సూద నర్సింలు, గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షులు శాంతయ్య యాదవ్ పలువురు పవన్‌కుమార్‌ను ప్రశంసించారు.