Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 70-80 శాతం విద్య ప్రయివేట్లోనే
- మోడీ కాలంలో అదానీ వెలుగులు
- ప్రజాకంఠక విధానాలతో కేంద్ర సర్కార్
- ఎస్ఎఫ్ఐ 17వ జాతీయ మహాసభల ఆహ్వానసంఘం ఏర్పాటు సభలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాజ్యాంగ విలువలను కాపాడుకోవటమే ప్రస్తుతం ఒక చాలెంజ్ అని ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు. భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) 17వ జాతీయ మహాసభలు డిసెంబర్ 13నుంచి 16వరకు ఉస్మానియా ఠాగూర్ ఆడిటోరియంలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆహ్వాన సంఘం ఏర్పాటు సమావేశాన్ని శుక్రవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా లింబాద్రి మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం ప్రజలకు సంబంధించిన హక్కులు, విలువలు, విద్యార్థులకు అవసరమైన అంశాలు కనుమరుగవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇట్లాంటి దశలో ధేశం పట్ల బాధ్యత కలిగిన విద్యార్ధి సంఘంగా సరైన తీర్మానాలు చేసి, కార్యాచరణ రూపొందించుకునేం దుకు తగిన చారిత్రక నేపథ్యమిదని సూచించారు. శాస్త్రీయ ధృక్పథంతో కూడిన విద్యావిధానం కోసం ఈ మహాసభల్లో చర్చించాలన్నారు. దేశంలో అట్టడుగునున్న ప్రజలపై జరుగుతున్న దాడులు, ప్రభుత్వ తీరుపై విద్యార్థి లోకం ఆలోచించాని కోరారు. విద్యారంగంలో కూడా అనేక మార్పులొస్తున్నాయని చెప్పారు. కొఠారి కమిషన్నుంచి నేటి జాతీయ నూతన విద్యావిధానం వరకు పరిశీలించి వాస్తవాలను ప్రజలముందుంచాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. నూతన విద్యావిధానంపై ఇప్పటి వరకు పార్లమెంట్లో చట్టం కాలేదని చెప్పారు. విధి విధానాలు కూడా లేవన్నారు. అయినా ఆ విధాన సారాన్ని వివిధ రూపాల్లో అమలు చేస్తున్న స్థితిని చూస్తున్నామని చెప్పారు. టీఎస్పీఎస్సీ మాజీ చైర్మెన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం విలువలతో ఎస్ఎఫ్ఐ పనిచేస్తున్నట్టుగానే తెలంగాణ నేల అటువంటి విలువలకోసం పని చేస్తున్నదని గుర్తు చేశారు. అటువంటి విలువలతో ఉన్న ఉద్యమాలను కాపాడుకుంటున్నదనీ, కొనసాగి స్తున్నదని చెప్పారు. దేశంలో నెలకొన్నటువంటి సంక్షోభ పరిస్థితుల కారణంగా మౌలికంగా భారత రాజ్యాంగానికి, ప్రజా స్వామిక విలువలకు, స్వాతం త్య్రానికి విఘాలం కలుగుతుందని చెప్పారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఈ దేశం నిర్మాణం, దాని సార్వభౌమాధికారాన్ని కాపాడు కోవటానికి పని చేస్తారు. ఒక పౌరుడిగా రాజ్యాం గాన్ని కాపాడుకోవటం ఎట్లా? అనేది మొదటి ప్రాధా న్యతగా ఉండాలి. దాన్ని కాపాడు కోకపోతే..స్వేచ్ఛ, స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం ఏదీ ఉండదని చెప్పారు. కేంద్రంలో అధికారంలోఉన్న బీజేపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నూతన జాతీయ విధ్యా విధానం పూర్తిగా ప్రజా వ్యతిరేకంగా, ప్రజా కంఠకం గా ఉందని విమర్శించారు. ప్రజా సంస్కృతిని, రాజ కీయ విలువలను దెబ్బ తీసే విధంగా ఉన్నదన్నారు. మతతత్వం, కార్పొరేటీకరణ, కేంద్రీకరణ పెంపొందిం చేందుకు తోడ్పడే విధంగా మోడీ ప్రభుత్వం తీసుకొ చ్చిన నూతన విధ్యా విధానం ఉందన్నారు. ఇది ప్రజల మౌలిక హక్కు లకు, ప్రాధమిక సాంస్కృతిక హక్కుకు విఘాతంగా ఉన్ననేపథ్యంలో ఈ సభల్లో లోతైన చర్చ జరగాలని ఆకాంక్షించారు. ఈ మధ్య కాలంలో యూజీసీ ఇష్ట మొచ్చిన రీతిలో విశ్వ విద్యాలయాలను కాషాయీక రణ చేయడానికి, లేదా వారికి సంబంధించిన మను షులను ఆయా బాధ్యత ల్లో జొప్పించటానికి కొత్త విధానాలను తీసుకొస్తున్న దని చెప్పారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటు న్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రొఫెసర్ కె నాగేశ్వర్ మాట్లాడుతూ సమాజంలో వస్తున్నటువంటి మతవాద, మితవాద ఆలోచనల ప్రబావం ఒక పక్క, మరో పక్క సమాజంలో మెజార్టీ కష్టజీవుల పక్షాన నిలబడి వారిలో చైతన్యాన్ని రగిలించేందుకు కృషి చేస్తున్న వారి ఆలోచనలు సమాజంలో ఉన్నాయన్నారు. ఈ తరుణంలో ఆలోచనా రంగంలో పెద్ద సంఘర్షణ జరుగుతున్నదని చెప్పారు. ఈ సంఘర్షణకు ఎస్ఎఫ్ఐ 17వ మహాసభ వేదిక కావాలన్నారు. ఎస్ఎఫ్ఐ ఏ ఆలోచనలకైతే ప్రాతినిధ్యం వహిస్తున్న దో..ఆ భావాల్ని విస్తృతంగా ప్రజల్లోకి, విద్యార్థి లోకానికి తీసుకెళ్లగలిగినప్పుడే తమ లక్ష్యం నెర వేరుతున్నదని చెప్పారు. ధరల పెరుగుదల, రూపాయి పతనం, దేశభక్తి, మతం, ప్రయివేటీకరణ తదితర అంశాలపట్ల విద్యార్థులకు సరైన దృక్పధాన్ని ఏర్పర్చాల్సిన బాధ్యత ఉందన్నారు. భావోద్వేగాల చుట్టూ విద్యార్థుల ఆలోచనలను కట్టిపడేస్తున్న భావాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ విద్యతో పాటు సామాజిక ఆర్థిక, రాజకీయ పరిస్థితిపై మహాసభల్లో చర్చ జరపాలని సూచించారు. నూతన జాతీయ విధానాన్ని రద్దు చేయాలనే డిమాండ్ రావాలన్నారు. ప్రయివేటీకరణ ప్రభావంపై చర్చ జరగాలనీ, దేశ భవిష్యత్లో విద్యకు ఉన్న ప్రాదాన్యతపై తగిన చర్చ చేయాలన్నారు.
మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లయినా నేటిని కోట్లాది మంది నిరక్ష్యరాస్యులుగా ఎందుకున్నారో ప్రభుత్వాలు సమాధానం చెప్పాల న్నారు. పాలకుల నిర్లక్ష్య విధానాలే ఇందుకు కారణమని విమర్శించారు.
ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్య దర్శులు విపీ సాను, మయుక్ బిశ్వాస్ మాట్లాడుతూ సంఘం జాతీయ మహాసభలు డిసెంబర్ 13నుంచి 16 వరకు తెలంగాణలో జరపటం సంతోషమ న్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట గడ్డపై జరుగుతున్న ఈ మహాసభల్లో దేశ భవిష్యత్ కోసం తగిన విధంగా తీర్మానాలుంటాయని చెప్పారు. లౌకిక, ప్రజాస్వామిక విలువలకు పాతరేస్తున్న మోడీ ప్రభత్వ విధానాలపై పోరాటాలకు రూపకల్పన చేస్తామన్నారు.ఇప్పటికే హిమచల్ ప్రదేశ్లాంటి చోట్ల అలాంటి పోరాటాలు జరుగుతున్నాయని చెప్పారు.
అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్ మాట్లాడుతూ విద్యారంగంలో వస్తున్న మార్పులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సెక్యులర్ భావాలను దెబ్బ తీసేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. విద్యారంగాన్ని భ్రష్టుపట్టించి కార్పొరేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నదని తెలిపారు. అంబేద్కర్ ఆలోచన, అల్లూరి స్ఫూర్తితో ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు.
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఎస్ వీరయ్య మాట్లాడుతూ విద్యార్థులు తమ బతుకులకే పరిమి తమై ఆలోచిస్తున్నారని చెప్పారు. వారిని వెన్నుతట్టి లేపాల్సిన అవశ్యకత ఎస్ఎఫ్ఐపై ఉందన్నారు మోడీ ప్రధాని అయిన తర్వాత ఆదానీ వెలిగిపోతున్నారని తెలిపారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు ఆహ్వానసంఘం కమిటీని ప్రతిపాదించారు. గౌరవ అధ్యక్షులుగా ఘంటా చక్రపాణి, అధ్యక్షులుగా ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, గౌరవ సలహాదారుగా ప్రొఫెసర్ నాగేశ్వర్, సహాఅధ్యక్షులుగా ఎం శ్రీనివాస్ , ప్రధాన కార్యదర్శి టి నాగరాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆర్ఎల్ మూర్తి, కోశాధికారిగా ఎండీ జావేద్లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పూర్వ అధ్యక్ష, కార్యదర్శులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.