Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ రాష్ట్ర నాయకులకు దమ్ముంటే..
- నిధులను తేవాలి : మంత్రి హరీశ్
నవతెలంగాణ-దుబ్బాక
'మోటర్లకు మీటర్లు పెట్టాలన్నా రు.. మే పెట్టమని తెగేసి చెప్పాం.. దాంతో వివిధ రూపాల్లో రాష్ట్రానికి రావాల్సిన రూ.12 వేల కోట్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిలిపివేసింది. అయినప్పటికీ..రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందజేస్తుంది. బీజేపీ రాష్ట్ర నాయకులకు దమ్ముంటే.. వెంటనే ఆ రూ.12వేల కోట్లను తీసుకురావాలి' అని మంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలిక కేంద్రంలోని కోమటిరెడ్డి రజినీకాంత్ రెడ్డి ఫంక్షన్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన దుబ్బాక ఆత్మ కమిటీ చైర్మెన్, పాలకవర్గం, దౌల్తాబాద్, తొగుట మండలాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్, పాలకవర్గాల ప్రమాణ స్వీకారోత్సవాలకు మంత్రితో పాటు మెదక్ ఎంపీ, టీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో కాలిన మోటర్లకు రిపేర్లు చేయించడానికే సర్పంచులు అప్పుల పాలయ్యేవారని, నేడు ఆ దుస్థితి లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందజేస్తుందన్నారు. బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో అబద్దాలను సైతం అందంగా ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.