Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం అభినందన
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
అన్నారం పంప్‌హౌజ్‌లోని మొదటి పంపును ఇంజినీర్లు శనివారం జయప్రదంగా పున:ప్రారంభించినట్టు రాష్ట్ర లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్ సలహాదారు పెంటారెడ్డి , ఇంజినీర్ ఇన్ చీఫ్ నల్ల వెంకటేశ్వర్లు తెలిపారు. పంపు తన ప్రమాణాలకు అనుగుణంగా పనిచేస్తున్నదని తెలిపారు. డిజైన్డ్ డిశ్చార్జీని సైతం పంపు ఎత్తిపోసిందని ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు చెప్పారు. పంపు పనితీరు పట్ల పూర్తి సంతప్తిని వ్యక్తం చేశారు. ఇక ఒక్కొక్కటిగా పంపులను పనిలోకి తెస్తామని తెలిపారు. అదే విధంగా కన్నెపల్లి పంప్‌హౌజ్‌లో కూడా పనులు ముమ్మరంగా సాగుతున్నాయని వివరించారు. అక్కడి పంపులను అక్టోబర్ చివరి నాటికి పూర్తిస్థాయిలో పనిచేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం అసెంబ్లీలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అన్నారం పంప్‌హౌజ్‌లో మొదటి పంపును జయప్రదంగా నడిపామని సాగునీటి శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ అన్నారు. ఈ కషిలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ సి. మురళీధర్ కూడా ఈ విజయం పట్ల సంతప్తిని వ్యక్తం చేస్తూ ఇంజినీర్లకు అభినందనలు తెలియజేశారు. అనుకున్న ప్రకారం రెండు నెలల కాలంలోనే అన్నారం పంప్‌హౌజ్‌లోని మోటార్లను పునరుద్ధరిం చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సలహాదారు పెంటారెడ్డి, సీఈ వెంకటేశ్వర్లును అభినందించారు. ఇదే స్ఫూర్తితో మిగతా పంపులను కూడా నడిపించాలని కోరారు. ఈమేరకు శనివారం సాగునీటి శాఖ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.