Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జహీరాబాద్ లోక్‌సభ సభ్యుడు బీబీ పాటిల్ ఎన్నిక చెల్లదంటూ మదన్మోహన్రావు వేసిన ఎన్నికల కేసు విచారణ ఈ నెల 20కి వాయిదా పడింది. వేరే రాష్ట్రంలో పోలీసుల కేసు గురించి ఈసీకి చెప్పకుండా ఎన్నికల్లో గెలుపొందడం చెల్లదంటూ ఆయన సుప్రీం కోర్టులో రిట్ దాఖలు చేశారు. ఈ వ్యవహారాన్ని హైకోర్టులో పరిష్కరించుకోవాలంటూ సుప్రీం స్పష్టం చేసింది. దీంతో హైకోర్టులో వేసిన రిట్‌ను చీఫ్ జస్టిస్ ఉజ్జల్‌భూయాన్ సోమవారం విచారణ జరిపారు. వాయిదాలు లేకుండా 20 నుంచి విచారణ చేస్తామని ప్రకటించారు.
ముందస్తు బెయిల్ మంజూరు
కేంద్ర మాజీ మంత్రి పి శివశంకర్ కొడుకు డాక్టర్ వినరుకుమార్‌కు సివిల్ కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. రంగారెడ్డి జిల్లా మామిడిపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 324లోని 16 ఎకరాల భూవివాద కేసులో వినరుతోపాటు ఇతరులపై పహడీ షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయనకు జస్టిస్ సురేందర్ ముందస్తు బెయిల్ మంజూరు చేశారు.
ప్రభుత్వ వైఖరి చెప్పండి
గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు పీజీ మెడికల్ అడ్మిషన్లల్లో ఇన్‌సర్వీస్ కోటా రిజర్వేషన్ల నిమిత్తం జారీ చేసిన జీవో అమలు చేయకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ జీవో ప్రకారం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇన్ సర్వీస్కోటా అమలు చేయకపో డాన్ని సవాలు చేస్తూ డాక్టర్లు దినేష్ కుమార్ ఇతరులు దాఖలు చేసిన రిట్లపై విచారణను ఈనెల 12కి వాయిదా పడింది. ఈ మేరకు జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ నామావరపు రాజేశ్వర్రావులతో కూడిన డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది.