Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంజినీరింగ్ ఫీజులపై స్పష్టత కరువు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. అదేనెల 11, 12 తేదీల్లో ఆన్లైన్లో ప్రాథమిక సమాచారం అందుబాటులో ఉండడం తో పాటు ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుకింగ్ చేసుకునేందుకు అవకాశమున్నది. 12న ధ్రువప్రతాల పరిశీలన, 12, 13 తేదీల్లో వెబ్అప్షన్ల నమోదు చేయాలి. ఈనెల 16న రెండోవిడత సీట్ల కేటాయింపు చేస్తారు. 16 నుంచి 18 వరకు ట్యూషన్ ఫీజు చెల్లింపుతోపాటు ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అయితే ఇప్పటి వరకు ఇంజినీరింగ్ ఫీజులకు సంబంధించి స్పష్టత లేదు. కాలేజీ యాజమాన్యాలతో టీఏఎఫ్ఆర్సీ సంప్రదింపులు జరిపి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. కానీ ఉత్తర్వులు విడుదల కాకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.