Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా జవహర్ బాల్ మంచ్ అధ్వర్యంలో 'తెలంగాణలో భిన్నత్వంలో ఏకత్వం' అనే అంశంపై జాతీయ చిత్ర లేఖన పోటీలు నిర్వహి ంచనున్నారు. సోమవారం గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంచ్ రాష్ట్ర చీఫ్ కో ఆర్డినేటర్ మామిడి రిషికేశ్ రెడ్డి మాట్లా డారు.భిన్న మతాలు, భిన్న సంస్కృతు ల పవిత్ర భూమి భారత దేశమనీ, బౌద్ధ, జైన, సిక్కు మతాలు అవసరాను గుణంగా ఈ దేశంలో ఉద్భవించాయ ని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన ఇస్లాం, క్రైస్తవం, జుడాయిజాలను కూ డా దేశం స్వాగతించి అక్కున చేర్చు కుందని గుర్తుచేశారు. భారత దేశం అనేది ఒక భిన్నత్వంలో ఏకత్వం అనీ, ఇదే అంశం మీద నిర్వహించే పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తామని వెల్లడించారు. భారత్ జోడొ యాత్ర అనంతరం భారత్ జోడో లోగో, భారత్ జోడో -బచ్చె జోడో నినాదాలతో ఉన్న పుస్తకాలను పంపి ణీ చేయనున్నట్టు వెల్లడించారు.