Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కేటీఆర్‌తో ఆ సంస్థ ఎండీ భేటీ
హైదరాబాద్ : ఇండియన్ ఇమ్యూనో లాజికల్స్ లిమిటెడ్ సంస్థ(ఐఐఎల్) రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందు కొచ్చింది. హైదరాబాద్‌లోని జినోమ్ వ్యాలీలో వెటర్నరీ వ్యాక్సిన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది. ఈ జంతువుల వ్యాక్సిన్ తయారీ కేంద్రానికి రూ.700 కోట్ల పెట్టుబడులకు సిద్దంగా ఉన్నట్టు మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్‌కుమార్ వెల్లడించారు. పాదాలు, నోటి ద్వారా పశువులకు వచ్చే వ్యాధులకు సంబంధించిన వ్యాక్సిన్ ఉత్పత్తిని రెట్టింపు చేయనున్నామన్నారు. వ్యాక్సిన్ తయారీ కేంద్రం ద్వారా 750 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ జోరు కొనసాగుతోందన్నారు.. ఇప్పటికే గచ్చిబౌలిలో ఐఐఎల్‌కు ఓ వెటర్నరీ వ్యాక్సిన్ ప్లాంట్ ఉంది. ఇందులో ఏడాదికి 300 మిలియన్ వ్యాక్సిన్ డోసులను ఆ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. కొత్త యూనిట్‌లోనూ ఇంతే సామర్థ్యం వాక్సిన్లను ఉత్పత్తి చేయనున్నట్టు ప్రకటించింది.