Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా టి.చక్రపాణి, ఎస్వీ.రమ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా టి.చక్రపాణి, ఎస్వీ.రమ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు సోమవారం ఎస్వీ రమ ఒక ప్రకటన విడుదల చేశారు. తమ రాష్ట్ర మహాసభలో 17 మంది ఆఫీస్ బేరర్లు, 37 మంది సభ్యులతో నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నట్టు తెలిపారు. కోశాధికారిగా ఉన్ని కృష్ణ, ఉపాధ్యక్షులుగా సీహెచ్.ప్రవీణ్, రాధా, జి.పద్మ, మాయ, ఇందుర్తి సులోచన, కార్యదర్శులుగా జి.కవిత, రాజేశ్వరి, సత్యనారాయణ, సుల్తాన్, బాలలక్ష్మి, కె.నర్సమ్మ, సరస్వతిలతో పాటు ఇద్దరు కో-ఆప్షన్ సభ్యులుంటారని వెల్లడించారు. మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని కోరారు. స్వచ్ఛంద సంస్థలకు పథకం నిర్వహణను ఇచ్చే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సూచించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలనీ, కోడిగుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులందరికీ గుర్తింపు కార్డులివ్వాలని విజ్ఞప్తి చేశారు.