Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక ఇబ్బందులే కారణం..
- బాలకృష్ణయ్య కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి
- వీఆర్ఏల సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు వెంకటయ్య, రాధిక
నవతెలంగాణ- హన్వాడ
ఆర్థిక ఇబ్బందులు తాళలేక మనోవేదనకు గురై వీఆర్ఏ ప్రాణం కోల్పోయారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల పరిధిలోని యారోనపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. తోటి వీఆర్ఏలు తెలిపిన వివరాల ప్రకారం..
యారోనపల్లి గ్రామంలో వీఆర్ఏగా బాలకృష్ణయ్య విధులు నిర్వహిస్తున్నాడు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని మూడు నెలలుగా వీఆర్ఏలు సమ్మెలో ఉన్నారు. ఈ క్రమంలో జీతాలు లేక.. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం గడవడమే కష్టంగా మారింది. బాలకృష్ణయ్య ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలో అనారోగ్యానికి గురై 15 రోజులు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందాడు. మందుల కోసం మళ్లీ డబ్బు అవసరమైంది. తోటి వీఆర్ఏలు కొంత ఆర్థిక సహాయం చేశారు. అయినా పరిస్థితి చేజారి బాలకృష్ణయ్య మృతిచెందాడు. వారికి కనీసం ఉండటానికి సొంత ఇల్లు కూడా లేదు. అద్దె ఇంట్లో ఉంటున్నారు. ప్రభుత్వం వెంటనే బాలకృష్ణయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు వెంకటయ్య, కార్యదర్శి రాధిక కోరారు.