Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టోల్ ఫ్రీ నెంబర్ 14416
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మానసిక సమస్యలతో బాధపడే వారికి టెలి మెంటల్ సేవలు అందు బాటులోకి వచ్చాయి. మంగళవారం హైదరాబాద్లో దీనికి సంబంధించిన కాల్ సెంటర్ను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు ప్రారంభిం చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరంతరాయంగా సేవలందిం చేందుకు వీలుగా ఈ కేంద్రంలో 25 మంది శిక్షణ పొందిన కౌన్సిలర్లు, మనస్తత్వవేత్తలు, మానసిక వైద్యులుంటారని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా రోగులకు అవసరమైన మానసిక నిపుణులు,సైకియాట్రిస్టులు, సైకాలజిస్టుల సేవలు అందిస్తారని వివరించారు. ఎలాంటి సేవలు అవసరమైనా టోల్ ఫ్రీ నెంబర్ 14416కు కాల్ చేసి వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ సేవలు పూర్తిగా ఉచితం కాగా, ప్రజలు చెప్పే సమస్యలను గోప్యంగా ఉంచబడతా యని అన్నారు. కాల్ సెంటర్కు అవసరమైన సాంకేతిక సహాయాన్ని ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయం అందిస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి, డీఎంఈ డాక్టర్ రమేష్ రెడ్డి, టీఎస్ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, సీఎం ఓస్డీడీ గంగాధర్, ఆరోగ్యశ్రీ సీఈవో విశాలాచ్చి తదితరులు పాల్గొన్నారు.