Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హత్య చేసి ఉరేసుకున్నట్టు చిత్రీకరించారని అనుమానాలు
నవతెలంగాణ-ఆర్మూర్(ఆలూర్)
వృద్ధ దంపతులు అనుమానా స్పద స్థితిలో మృతి చెందిన ఘటన నిజామా బాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రంలో మంగళ వారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని 13వ వార్డు తెనుగు కాలనీకి చెందిన కుమ్మరి పడిగెల గంగారాం (70), పడిగెల గంగమని(65) చేపలు పట్టుకొని జీవించేవారు. వారి కొడుకు సంతోష్ 18 ఏండ్ల వయస్సులో 15 ఏండ్ల కిందట రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. దాంతో తమకు ఆసరాగా ఉంటాడని 2016లో తమ బంధువుల అబ్బాయి ఓంకార్ (17)ను పెంచుకుంటున్నారు. కాగా మంగళవారం ఉదయం దంపతులు అనుమానాస్పదంగా ఉరి వేసుకున్న స్థితిలో మృతిచెందారు. స్థానికులు బంధువులకు సమాచారం ఇచ్చి పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. దంపతులు పెంచుకుంటున్న ఓంకార్.. వీరిని హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. దాంతో ఓంకార్‌ను కస్టడీలోకి తీసుకొన్న పోలీసులు విచారిస్తున్నట్టు తెలిపారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో పరిశీలించారు. సంఘటననా స్థలానికి ఏసీపీ ప్రభాకర్ రావు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ సురేష్ బాబు,, ఎస్ఐలు, యస్.శ్రీకాంత్, జి. ప్రదీప్ కుమార్, బి శివరాం, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.