Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుర్తు తెలియని వ్యక్తుల పని
- కాంగ్రెస్ నాయకుల ఆందోళన
నవతెలంగాణ- చండూర్
నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పార్టీ జెండాలు, ఎన్నికల ప్రచార సామగ్రిని దహనం చేశారు. దుండగులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు చౌరస్తాలో బైటాయించారు. ఈ సందర్భంగా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ.. ఉపఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ప్రజా ఆదరణను చూసి ఓర్వలేకే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారన్నారు. మొదట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని భావించామని, విద్యుత్ అధికారులు పరిశీలించి షార్ట్ సర్క్యూట్ కాదని నిర్ధారించారని చెప్పారు. దుండగులు ఎంతటి వారైనా పట్టుకొని శిక్షించాలని, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు.