Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్నో భేటికి రాష్ట్రం నుంచి ఇంజినీర్లు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సమావేశాలు మంగళవారం లక్నో లో ముగిసాయి. ఈనెల ఎనిమిది, తొమ్మిది, పది, 11 తేదీల్లో ఈ సమావేశాలు నిర్వ హించారు. ప్రతియేటా కేంద్ర ప్రభుత్వ ఉపరితల రవాణా శాఖ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖలు ఈ సారి ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగాయి. రాష్ట్రం నుంచి ఐదుగురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎజీ సంజీవరావు, ఇంజినీర్లు నరేందర్‌రెడ్డి, రాజన్న, సంజీవరెడ్డి, ప్రకాశ్, సుదర్శన్ తదితరులు రాష్ట్రం నుంచి లక్నో ఇండియన్ రోడ్డు కాంగ్రెస్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఇంజినర్ ఇన్ చీఫ్ సంజీవరావు మాట్లాడుతూ ప్రతియేటా దేశంలో ఏదో ఒక ప్రాంతంలో ఇండియన్ రోడ్డు కాంగ్రెస్ జరుగుతుందని చెప్పారు. మూడేండ్ల క్రితం హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగిందని చెప్పారు. ఇందులో అనేక కొత్త ఆవిష్కరణలు ప్రదర్శించబడతాయని చెప్పారు. రోడ్లకు సంబంధించి అంతర్జాతీయంగా వచ్చే మార్పులతోపాటు, మనదేశ వాతావరణం, రవాణా పరిస్థితులు, ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు జాతీయ, రాష్ట్ర, గ్రామీణ రోడ్లను నిర్మిస్తారని వివరించారు. ఈమేరకు ఆ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.