Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) ఏపీ విశ్వవిద్యాలయం, ఐబీఎస్ గ్లోబల్ సంస్థ మధ్య మంగళవారం అవగాహన ఒప్పందం కుదిరింది. సాంతికేకత ఉత్పత్తి అభివృద్ధికి సహకరించడానికి, దాంతోపాటు ప్రపంచస్థాయిలో వీఐటీ ఏపీ వర్సిటీ ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు పోలాండ్ ఆధారిత సంస్థ అయిన ఐబీఎస్ గ్లోబల్ మద్దతు ఇవ్వనుంది. ఇన్నోవేషన్, స్టార్టప్‌లకు నిధులు, మంజూరు అవకాశాలను అన్వేషించడానికి అవగాహన ఒప్పందం ఉపయోగపడుతుందని వర్సిటీ వీసీ ఎస్వీ కోటారెడ్డి తెలిపారు. విద్యార్థులు, ఆచార్యులు అంకుర సంస్థల ఏర్పాటు, నూతన ఆవిష్కరణలకు అవసరమైన గ్రాంట్లను పొందేందుకు ఈ ఒప్పందం సహాయపడుతుందని ఐబీఎస్ గ్లోబల్ ప్రతినిధి (చీఫ్ టెక్నికల్ ఆఫీసర్) శ్రీరామన్ తేజ వెనిగళ్ల వివరించారు. స్టార్టప్ ప్రయాణం అనేక సవాళ్లతో కూడుకున్నదని వీఐటీ ఏపీ వర్సిటీ ఐఐఈసీ డైరెక్టర్ అమీత్ చవాన్ తెలిపారు. ఐబీఎస్ గ్లోబల్ వంటి ఎకోసిస్టం ఎనేబుల్స్తో భాగస్వామ్యం ఈ సవాళ్లను ఎదుర్కొని స్టార్టప్‌లు విజయం సాధించడానికి మార్గం సుగమమవుతుందని పేర్కొన్నారు.