Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎల్ఎఫ్ చైర్మెన్ నల్లా సూర్యప్రకాశ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రజా సమస్యలను పరిష్కారం కోసం ఈనెల 15న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లను ముట్టడించాలని బీఎల్ఎఫ్ చైర్మెన్ నల్లా సూర్యప్రకాశ్ పిలుపునిచ్చారు. ఈనెల 17న ఓంకార్ వర్ధంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనికోరారు. మంగళవారం హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లిలో గల ఓంకార్ భవన్లో బీఎల్ఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యప్రకాశ్ మాట్లాడుతూ అర్హులైన వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలనీ, బీసీ, ఎంబీసీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్లకు వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దళిత బంధు అర్హులైన వారికే ఇవ్వాలనీ, అనర్హులకిచ్చి అన్యాయం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.ఐదు లక్షల ఆర్థిక సహాయం చేయాలని తెలిపారు. ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసున్న వారికి పట్టాలిచ్చి ఇంటి నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు. అర్హులైన వారికి రేషన్ కార్డులివ్వాలనీ, పేద, మధ్యతరగతి ప్రజల నివాస ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి వివరించారు. రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలనీ, సొంత భవనాల నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని సూచించారు. బీఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు వనం సుధాకర్ అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్, నాయకులు వల్లెపు ఉపేందర్‌రెడ్డి, ఎస్ సిద్ధిరాములు, వస్కుల మట్టయ్య, వరికుప్పల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.