Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
తెలంగాణ ఆడియాలజిస్ట్స్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్స్ అసోసియేషన్ (టీఏఎస్ఎల్పీఏ) డాక్టర్ ఫాతిమా అబ్బాసీకి బెస్ట్ స్పీచ్ థెరఫీ పేథాలజిస్ట్ అవార్డును అందచేసింది. స్పీచ్ థెరఫీలో ఆమె 2022 సంవత్సరంలో అద్భుతమైన విజయాలు సాధించారనీ, దానికి గుర్తింపుగా ఈ అవార్డును ఇస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ వత్తికి ఆమె అత్యుత్తమ సహకారం అందించారని పేర్కొన్నారు. అక్టోబర్ 10న ప్రపంచ ఆడియాలజిస్టుల దినోత్సవం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఆమె టీఏఎస్ఎల్పీఏ సలహాదారు డాక్టర్ గంజి శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ నాగేందర్ కంకిపాటి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఇమాద్ ఖాన్ రుమాన్ అభినందనలు తెలిపారు.