Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్ బోర్డు కార్యదర్శికి టీపీజేఎంఏ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రయివేటు జూనియర్ కాలేజీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రయివేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాల సంఘం (టీపీజేఎంఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్‌ను మంగళవారం హైదరాబాద్‌లో టీపీజేఎంఏ అధ్యక్షులు గౌరి సతీశ్ నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ట్యూషన్ ఫీజును పెంచాలనీ, ప్రయివేటు జూనియర్ కాలేజీలకు మూడు నుంచి ఐదేండ్ల వరకు అనుబంధ గుర్తింపునివ్వాలని కోరారు. ఈ సమస్యలపై కార్యదర్శి సానుకూలంగా స్పందించారనీ, వాటి పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని హామీఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీజేఎంఏ గౌరవాధ్యక్షులు వరదారెడ్డి, ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి, నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, బాలకృష్ణారెడ్డి, మల్లేష్, శ్రీనివాస్‌చౌదరి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.