Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆమోదించకుండా ఉత్తర్వులు ఇవ్వాలని బీజేపీ రిట్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో రికార్డు స్థాయిలో కొత్త ఓటర్లుగా నమోదయ్యేందుకు 25 వేల దరఖాస్తులు వచ్చాయనీ, వాటిని ఆమోదిస్తే బోగస్ ఓట్లకు ఆమోదం లభించినట్లేనని పేర్కొంటూ బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్‌రెడ్డి దాఖలు చేసిన రిట్లో జూలై 31వ తేదీ నాటికి ఉన్న ఓటర్ల లిస్ట్ మేరకు నవంబర్ 3న ఉప ఎన్నికల పోలింగ్ జరిగేలా ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై ఈ నెల 13న విచారిస్తామని చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ మంగళవారం ప్రకటించింది. ఉన్న ఓటర్ల లిస్ట్ మేరకే ఎన్నికలు జరిగేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.కాగా రాజాసింగ్‌పై పోలీసులు పెట్టిన యాక్ట్ కేసులో గతంలో ఆదేశించినా ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. నాలుగు వారాలుగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నాలుగు వారాలు గడుస్తున్న ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని ప్రశ్నించింది.