Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీకి తెలంగాణ జన సమితి (టీజేఎస్) అభ్యర్థిని ప్రకటించింది. పల్లె వినయ్ కుమార్ గౌడ్‌ను తమ పార్టీ నుంచి బరిలోకి దించుతున్నట్టు ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం వెల్లడించారు. తెలంగాణ అస్థిత్వాన్ని, ప్రయోజనాలను కేసీఆర్ వదిలేశారని ఆయన ఈ సందర్భంగా విమర్శించారు. ఆ అస్థిత్వాన్ని కాపాడేందుకే టీజేఎస్ పోరాడుతున్నదని తెలిపారు. బోడంగిపర్తి గ్రామ సర్పంచ్‌గా 2006 నుంచి 2011 వరకు సర్పంచ్‌గా సేవలందించిన వినరు, సీపీఐ నాయకునిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన టీజేఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న పల్లె లింగం ప్రథమ సంతానం వినయ్ కుమార్ గౌడ్. ప్రయివేటు పాఠశాలల యాజమాన్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా కూడా ఆయన కొనసాగుతున్నారు.