Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికారాబాద్ జిల్లాలో దారుణం...
నవతెలంగాణ-దోమ
ఆర్మీ జవాన్ యువతిపై లైంగికదాడికి పాల్పడిన ఘటన వికారాబాద్ జిల్లా దోమ మండలంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. మండలానికి చెందిన ఓ యువతి (21)తో దాదాపూర్ గ్రామానికి చెందిన ఆర్మీజవాన్ కావలి రామకృష్ణకు ఏడాది కిందట ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. అస్సాంలోని గౌహతిలో ఆర్మీ జవాన్‌గా విధులు నిర్వహిస్తున్న రామకృష్ణ వారం రోజుల కిందట సొంత గ్రామం దాదాపూర్‌కు వచ్చారు. అప్పటి నుంచి ఆ యువతితో పోన్లో మాట్లాడుతూ పెళ్లి చేసుకుంటానని మోసగించి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి గ్రామానికి వచ్చిన రామకృష్ణ ఆ యువతికి పోన్ చేసి గ్రామ శివారులోకి తీసుకెళ్లగా కుటుంబ సభ్యులు గమనించి ఆ యువకుడిని వెంబడించి ఇద్దరిని పట్టుకున్నారు. గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి వదిలి పెట్టారు. ఈ సంఘటనపై బాధితురాలు దోమ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా మొదట నిరాకరించారు. సాయంత్రానికి ఫిర్యాదు తీసుకున్నారు. ఈ విషయంపై దోమ ఎస్ఐ విశ్వజన్‌ను వివరణ కోరగా భాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడుపై ఐపీసీ 376,420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.