Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గానికి వంద పడకల ఆస్పత్రిని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకూ చెన్నూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 30 పడకలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్యను ప్రభుత్వం వందకు పెంచింది.